Moral story - ఎంత మంచి మాట కదండి
ఇంటి గుమ్మం ముందు కూర్చుని అమ్మ బియ్యంలో రాళ్లు ఏరుతూ కొడుకు చదువుతూ ఉన్నారు. అక్కడకు ఆకుకూరలు అమ్ముకుంటూ ఓ ఆవిడ వచ్చారు.
ఆకుకూర కట్ట ఎంత అని అడగగా ఐదు రూపాయలు అమ్మగారు అన్నది, అమ్మే ఆవిడా నాలుగు కట్టలు తీసుకుంటా మూడు రూపాయలు కట్ట చేసివ్వు అని బేరమాడింది కొనాల్సిన ఆవిడ. బేరం కుదరక ఆవిడ తన గంప తీసుకుని నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి అమ్మగారు నాలుగు చేసుకోండి, అని.
ఈవిడ కుదరదు, మూడంటే మూడే అన్నది.
సరే అని ఆవిడ ఇచ్చేస్తూ మళ్ళీ తన దారి పట్టాలని లేవగా కాస్త కాలు జారింది.
ఎంటమ్మాయి తిండి తినలేదా అని కొన్న ఆవిడ అడగగా,
లేదమ్మగారు ఇవన్నీ అమ్మేసి వెళ్లి వండుకు తినాలి అని చెప్పింది.
సర్లే గంప దించి రా తినివెల్దువు, అని పిలిచి ఇంట్లో నుండి ఆరు ఇడ్లిలు తెచ్చి ఇచ్చింది, తినమని. తిన్నాక, తన గంప తీసుకుని తాను వెళ్లిపోయాక ఇవన్నీ గమనిస్తున్న కొడుకు అమ్మను ఒక ప్రశ్న వేసాడు.
అమ్మ ఆకుకూర బేరం ఆడావు. అది ఐదు రూపాయలే నాలుగు కట్టలు ఇరవై రూపాయలే, కానీ నువ్వు ఆరు ఇడ్లిలు ఊరకనే పెట్టావు, ఒక్కో ఇడ్లి ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది, అని అన్నాడు.
అందుకు అమ్మ చూడు కన్నా,
వ్యాపారంలో దానధర్మాలు ఉండకూడదు.
దానంలో వ్యాపారం చూడకూడదు. అని
ఎంత మంచి మాట కదండి